AP: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట.. చేసిన హామీ ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని సీఎం చంద్రబాబుపై వైసీపీ మండిపడింది. ఆదివారం ఎక్స్ వేదికగా.. ‘శిశుపాలుడి తప్పుల్లా.. చిత్రగుప్తుడి చిట్టాల్లా.. నీ అబద్ధాలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి చంద్రబాబు. ఇచ్చిన మాట, చేసిన హామీని మర్చిపోయావు. ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదు. కానీ బిల్డప్పులకు మాత్రం ఏమీ లోటు లేదు. ఒక్క పథకాన్ని అయినా పూర్తిగా ఇచ్చావా?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.