ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా తామంతా పని చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్, గ్రామీణ నీటిసరఫరా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ’నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు. పని మాత్రమే కావాలి. ఉన్నత స్థాయి అధికారి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలి’ అని సూచించారు.