అధికారం కాదు.. బాధ్యత ఇచ్చారు: పవన్‌ కల్యాణ్‌

AP: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారు కేవలం ఓటెయ్యడమే కాకుండా చరిత్ర రాస్తారని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఏపీ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమికి ప్రజలు అధికారం కాదని, బాధ్యత ఇచ్చారని తెలిపారు. 21 సీట్లతో సర్దుకున్నప్పుడు విమర్శలు వచ్చినా, ప్రజల ఆశీర్వాదంతో వందశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్