వైద్య ఆరోగ్య శాఖలో 529 పోస్టులకు నోటిఫికేషన్‌

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద ఏపీ వైద్య సేవల నియామక బోర్డు 529 ఒప్పంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 419 స్టాఫ్‌ నర్సు, 24 ఫార్మసిస్టు, 86 మల్టీ రీహాబిలిటేషన్‌ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈనెల 13 నుంచి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టాఫ్‌ నర్సు పోస్టులు జోన్ల వారీగా, ఇతర పోస్టులు జిల్లాల స్థాయిలో భర్తీ చేయబడతాయి. మరోవైపు, ఎన్‌హెచ్‌ఎం కింద ఆరు కేటగిరిల్లో 267 వైద్యాధికారుల పోస్టుల నియామక ఉత్తర్వులు శుక్రవారం జారీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్