ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 12 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం వెల్లడించారు. ప్రత్యేక టెట్‌కు అర్హులైన ఇన్-సర్వీస్ టీచర్లు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.