AP: రాష్ట్రంలో మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు 2,111 ఎస్జీటీ, 350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు, 150 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.