ఏపీలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోని 414 మద్యం షాపులకు కొత్త లైసెన్సులు జారీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన, అక్టోబర్ 5న లాటరీ తీస్తారు. మొత్తం 3,650 మద్యం షాపుల్లో 3,236 షాపులు రెన్యువల్ చేసుకోగా, మిగిలిన 414 షాపులకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయిస్తారు.