AP: ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించే యాప్‌ను NRI విద్యార్థి సిద్ధార్థ్ రూపొందించాడు. అనంతపురానికి చెందిన ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల సీఎం చంద్రబాబును సోమవారం కలిశాడు. ఏఐ సాయంతో సిర్కాడియావీ యాప్‌ను 14 ఏళ్ల సిద్ధార్థ్ రూపొందించాడు. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ యాప్ ఉపయోగించి గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో సిద్ధార్థ్‌ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.