AP: రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మె మంగళవారం ముగిసింది. 10 రోజుల్లో రూ. వెయ్యి కోట్ల బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించినట్లు స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ వెల్లడించింది. అయితే 10 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మళ్లీ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది.