విజయవాడ పోలీసు కమిషనరేట్ కొత్త సిపిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. వి. రాజశేఖర బాబును సోమవారం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.