కూలీల ఆటోను ఢీకొన్న కారు.. ఆరుగురికి గాయాలు

పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద సోమవారం కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో అందులోని ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనిగండ్లపాడు నుంచి ముచ్చింతాలకు కూలీలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై బాధిత బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్