ఆదివారం ఆర్కే ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో పెనుగంచిప్రోలు మండలంలోని 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 13,00,804 మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య స్వయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.