జగ్గయ్యపేట: మనవడిపై చేతబడి.. తల్లిపైనే కూతురి ఫిర్యాదు

తన సొంత మనవడిపై చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ కూతురు, అల్లుడు జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు సంవత్సరాల క్రితం తల్లికి ఇష్టం లేని వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే తన కుమారుడిపై (మనవడిపై) చేతబడి చేసే ప్రయత్నం చేసిందని కూతురు ఆరోపించింది. రెండు రోజుల నుంచి కుమారుడికి ఆరోగ్యం బాగోలేదని ఆమె వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్