జగ్గయ్యపేట: రహదారిపై కారు దగ్ధం

జగ్గయ్యపేటకు చెందిన ఒక వ్యక్తి కారులో చిల్లకల్లు వైపు వెళ్తుండగా, సోమవారం ఛత్రపతి చౌరస్తా సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారులు కారును ఆపి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, కారు పూర్తిగా దగ్ధమైంది. ఎమ్మెల్యే తాతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్