జగ్గయ్యపేట: కరెంట్ షాక్తో ఇల్లు దగ్ధం

జగ్గయ్య పేటలోని బలుసుపాడు రోడ్డులో కనకదుర్గమ్మ గుడి సమీపంలో గురువారం అధిక వోల్టేజ్ కారణంగా ఒక ఇల్లు దగ్ధమైంది. గోనుగుంట్ల ధనుంజయ్ తన తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

సంబంధిత పోస్ట్