జగ్గయ్యపేట: పర్మిషన్ కావాలంటే.. లంచం ఇవ్వాల్సిందే...!

ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందని, జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన రాజేంద్ర ప్రసాద్ కోళ్లఫారం ఏర్పాటుకు గతేడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు అనుమతులిచ్చి రద్దు చేశారని బాధితుడు తెలిపారు. అప్పటి నుంచి అనుమతుల కోసం తిరిగినా పట్టించుకోలేదని, పర్మిషన్ కోసం రూ. 3 లక్షలు లంచం ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి డిమాండ్ చేశారని రాజేంద్ర ప్రసాద్ కలెక్టర్ లక్ష్మీశకి పిజిఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్