జగ్గయ్యపేట: వింత.. మిరప చెట్టుకు వంకాయలు, టమాటాలు

జగ్గయ్యపేట మండలం తకెళ్లపాడులో ముత్యాల రమేశ్ అనే రైతు మిరపతోటలో ఒక మిరపచెట్టుకు వంకాయలు, టమాటాలు కాసిన వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ అసాధారణ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జన్యు మార్పిడి లేదా గ్రాఫ్టింగ్ వంటి ప్రక్రియల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ వింత పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్