లింగగూడెంలో వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వెళ్లారు. భక్తుల రద్దీతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో, ఆయన కారు దిగి కాలినడకన బయలుదేరారు. దారి పొడవునా భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నిరాడంబరతను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.