జగ్గయ్యపేటలో ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో యువతిని నమ్మించి, గర్భవతిని చేసి మోసగించిన ఘటన కలకలం రేపింది. క్రిస్టియన్‌పేటకు చెందిన కమల అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె మరణంపై తల్లి రత్నకుమారి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షేర్ మహమ్మద్‌పేటకు చెందిన నరేంద్ర రాజకీయ అండదండలతో తమను వేధిస్తున్నారని, వారికి పుట్టిన కుమారుడు తల్లిలేని వాడయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు.