పెనుగంచిప్రోలు: 24 ఏళ్ల యువకుడు అరెస్ట్

పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామానికి చెందిన వేముల వినయ్ (24) అనే యువకుడి వద్ద నుంచి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జగ్గయ్యపేట కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై అర్జున్ తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ప్రజలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్