పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనం, సేవలను ఇకపై ఆన్లైన్లో పొందవచ్చని ఈవో కిషోర్ కుమార్ తెలిపారు. దర్శనం టిక్కెట్లు, ప్రసాదం టిక్కెట్లతో పాటు https://www.aptemples.org వెబ్సైట్ లేదా 9552300009 వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అన్నదానం, గోసంరక్షణ వంటి పథకాలకు క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ (Google Pay, Phone Pe, Paytm, BHIM) ద్వారా కూడా విరాళాలు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.