పెనుగంచిప్రోలు: కాలువలో పడి రైతు మృతి

పెనుగంచిప్రోలు చెరువు కట్ట ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన పంట పొలాలకు వెళ్లే కాలవలో పడి తేజావత్ ధనమూర్తి అనే రైతు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్