శుక్రవారం జగ్గయ్యపేటలోని బలుసుపాడు రోడ్డులో పాత వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద యువకులు అతివేగంగా బైక్ నడుపుతూ ఒక వృద్ధురాలిని ఢీ కొట్టి పరారయ్యారు. సమీపంలో ఉన్న సోమేశ్వరరావు అనే యువకుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్కు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాస్ వెంటనే స్పందించి, క్షతగాత్రురాలిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.