దశదినకర్మలో ఉద్రిక్తత.. కర్రలతో దాడులు..

పెనుగంచిప్రోలులోని వడ్డెర కాలనీలో ఓ మహిళ దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. కార్యక్రమానికి వచ్చిన బంధువులతో కొందరు స్థానికులు గొడవపడటంతో ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెనుగంచిప్రోలు పోలీసులు జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించి, ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్