విజయవాడలో అంగన్వాడీల ధర్నా శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు చేయడాన్ని ఖండిస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో మైలవరంలో అంగన్వాడీలు ధర్నాలు నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ, నిద్రలో ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలు వినూత్న ప్రదర్శనలు చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ధర్నాను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.