శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం అమ్మకాలు: కేసు నమోదు

ఇబ్రహీంపట్నంలో నింపిన నకిలీ మద్యం సీసాలను జనార్దన్రావు పేరున ఉన్న ఏఎన్ఆర్ బార్తోపాటు భవానీపురంలోని లిక్కర్ షాప్లోనూ విక్రయించినట్లు ఏ2 అద్దేపల్లి జగన్మోహన్రావు విచారణలో అంగీకరించాడు. ఈ బాటిల్స్ను జనార్దన్రావు భాగస్వామిగా ఉన్న శ్రీనివాస వైన్స్కు కూడా సరఫరా చేశారు. మేనేజర్ కల్యాణ్ వారానికి 15 కేసుల వరకు నకిలీ సరకును తీసుకెళ్లి అమ్మేవాడని, వచ్చిన సొమ్ములో సగం పంచుకునేవారని తెలిసింది. ములకలచెరువులో నకిలీ బాగోతం బయటపడగానే జగన్మోహన్రావు అప్రమత్తమై, నకిలీ మద్యం తయారీ సెటప్ను గోదాముకు తరలించాడు. ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన సరకు నుంచి నమూనాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్