కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ సమయంలో జోగి రమేశ్ మాట్లాడుతూ, చంద్రబాబు తనను కక్ష గట్టి అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని, భార్యా బిడ్డల సాక్షిగా కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసి చెప్పానని అన్నారు. చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అంటూ ఆయన మండిపడ్డారు.