గొల్లపూడిలో బుధవారం ఉదయం పత్తి లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు, డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఉదయం పూట ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, లారీని పక్కకు తీసేందుకు చర్యలు చేపట్టారు.