మైలవరం ఎక్సైజ్ డివిజన్ పరిధిలో కల్తీ మద్యం కలకలం రేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం, ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దుర్గా ప్రసాద్ రావు నేతృత్వంలో రెండు బృందాలుగా ఏర్పడి మైలవరం, జి. కొండూరు, రెడ్డిగూడెంలలోని 11 వైన్ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కల్తీ మద్యం నిల్వలు, విక్రయాలపై అధికారులు దృష్టి సారించారు.