వెల్వడంలో అగ్ని ప్రమాదం.. గడ్డివాములు దగ్ధం..

మైలవరం మండలం వెల్వడంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాలుగు గడ్డివాములు బూడిదయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి వెళుతున్నప్పుడు టపాసులు పేలి గడ్డివాముపై పడటంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్