కాచవరం మాజీ సర్పంచ్ మృతి

ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొండితోక వెంకటరత్నం (54) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి, వెంకటరత్నం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్