మైలవరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

మైలవరంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. షిరిడీ సాయి బాబా పల్లకీలు మోస్తూ భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. మైలవరం ప్రథాన రహదారులపై షిరిడీ సాయిబాబా దేవస్థానం వరకు ర్యాలీ కొనసాగింది. దీంతో చూసేవారి కళ్ళకు తప్పెట్లు, కోలాటం, పల్లకీల వరుసలు ఆహ్లాదకరంగా మారాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్