మైలవరంలో బుధవారం రాత్రి ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, గేదె ఎదురుగా రావడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం తప్పింది. గేదెల యజమానులకు అవగాహన కల్పించినా తీరు మారకపోవడం బాధాకరమని సీఐ కిషోర్ బాబు అన్నారు. ఇకపై రోడ్లపై గేదెలను వదిలిపెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.