మైలవరంలో ఆదివారం టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు, జోగి రమేష్ ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని తెలుగు యువత అధ్యక్షులు లితీష్ హెచ్చరించారు.