మైలవరంలోని విజయవాడ నేషనల్ హైవే రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ బోర్డులు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. రింగు రోడ్డు నుండి మైలవరంలోకి వెళ్లే వందలాది వాహనాలకు ఈ బోర్డుల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు తెలిపారు. పంచాయతీ, నేషనల్ హైవే అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ప్రాణాపాయం సంభవించక ముందే బోర్డులను తొలగించాలని వారు వేడుకుంటున్నారు.