మైలవరం మార్కెట్ యార్డ్ లో రైతుల సమస్యలను మాజీ మంత్రి జోగి రమేష్ గురువారం పరామర్శించారు. ధాన్యం, మొక్కజొన్న ఆరబోసి 15 రోజులు అయినా కొనుగోలు చేసేవారు లేరని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు మాటలు గొప్పగా ఉంటాయని, కానీ పనితనం లేదని విమర్శించారు. వరి, మొక్కజొన్న రైతులు దళారుల పాలై తీవ్రంగా నష్టపోతున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఇసుక, మట్టి వ్యాపారంలో వాటాలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.