అనారోగ్య బాధితులకు శస్త్రచికిత్సల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి) రూపంలో ఆర్థికసాయం మంజూరైంది. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 6గురు లబ్ధిదారులకు రూ. 16.30 లక్షలు మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసి)లను లబ్ధిదారులకు గురువారం అందజేశారు.