మైలవరం: ప్రాణాలు పోతున్న చర్యలు తీసుకోరా..

మైలవరంలోని విజయవాడ నేషనల్ హైవే రోడ్డుపై ఉన్న రింగులో అక్రమ వ్యాపారాలు, ఎడ్వర్టైజ్మెంట్ బోర్డుల వల్ల ప్రాణాలు పోతున్నాయని, అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. వారం క్రితం జనార్థన్(65) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న వాహనం ఢీకొని మృతి చెందారు. ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్