ఇబ్రహీంపట్నం విటిపిఎస్ గేటు వద్ద సోమవారం టిప్పర్ లారీ ఓనర్ అసోసియేషన్, 7 గ్రామాల ప్రజలు విటిపిఎస్ ను ముట్టడించారు. బూడిద అక్రమ టెండర్ను రద్దు చేయాలని, కాలుష్య ప్రభావిత గ్రామాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.