వెలగలేరు: 250 కుక్కలు మృత్యువాత..

జి. కొండూరు(M) వెలగలేరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామాల్లో నివసిస్తున్న 250 కుక్కలకు పంచాయతీ అధికారులు విషమిచ్చి చంపారని స్థానికులు ఆరోపించారు. గ్రామాల్లో కుక్కలు ఎక్కువై చిన్న పిల్లలపై, పశువులపై దాడులు చేస్తున్నాయని, వాటిని అడవి ప్రాంతాల్లో వదిలివేయకుండా చంపడం అమానుషమని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై పంచాయతీ సెక్రెటరీపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్