ఎన్టీటీపీఎస్ చన్నీళ్ల కాలువలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్టేజ్-2 టెన్నెల్ వద్దకు మృతదేహం కొట్టుకురావడంతో అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న, 5.6 అడుగుల ఎత్తు గల మృతుడు నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై రవివర్మ తెలిపారు.