నిరుపయోగంగా 3ఎకరాల 35 సెంట్లు: స్మశాన వాటిక ఏర్పాటు చేయండి.

మైలవరం మండలం సబ్జపాడు గ్రామంలో స్మశాన వాటిక లేక ఎస్సీ, బీసీ, ఇతర కులాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి మృతదేహాలను వాగులో ఖననం చేయాల్సి వస్తుందని తెలిపారు. గ్రామ కంటానికి చెందిన మూడు ఎకరాల 35 సెంట్ల నిరుపయోగ భూమిని స్మశాన వాటికకు కేటాయించాలని అధికారులను కోరారు. ఈ భూమి కాలక్రమేణా ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్