దేవినేని ఉమ పేరిట వాట్సాప్ కాల్.. మోసం!

మాజీమంత్రి దేవినేని ఉమ పేరుతో వాట్సాప్ కాల్స్ చేసి, వైజాగ్ వాసి శ్రీనివాసరెడ్డిని సైబర్ నేరగాడు మోసం చేశాడు. లోకేశ్పై సోషల్ మీడియాలో కామెంట్ చేసిన శ్రీనివాసరెడ్డికి, సమస్య పరిష్కరిస్తానని దేవినేని ఉమ పేరుతో బెదిరించి, ఆపై సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నట్లు నమ్మించి స్కానర్ ద్వారా రూ.80 వేలు కాజేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్