దాసుళ్లపాలెంలో మహిళ మృతి.. తండ్రి, కుమారుడి అరెస్ట్

మైలవరం మండలం దాసుళ్లపాలెంలో ఫోన్ చేశాడన్న కారణంతో అనిల్ అనే యువకుడి ఇంటిపై వింజమూరి లక్ష్మయ్య, మిశాక్ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనిల్ తల్లి సారమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనను హత్యగా నమోదు చేసి, నిందితులైన తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఈ నెల 21న చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్