ఇబ్రహీంపట్నంలో నకిలీ కల్తీ మద్యం డంప్ బయటపడటంపై మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం తీవ్రంగా స్పందించారు. ములకలపేటలో తీగ లాగితే కల్తీ మద్యం కేంద్రం ఇబ్రహీంపట్నం అని తేలిందని, ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ వ్యవస్థ నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పేదవాడికి విషమిచ్చి చంపుతున్నారని, డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టడం సరికాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిదిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.