గడ్డి మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం, చికిత్సలో మృతి

నందిగామ మండలం మాగల్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు, ఆయన భార్య శైలజ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఇద్దరినీ గొల్లపూడి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్