కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోటారు వద్ద ఉన్న విద్యుత్ వైర్ను అనుకోకుండా తాకడంతో కృష్ణకుమారి అనే మహిళ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.