కంచికచర్లకు చెందిన మందా సామ్యేలు తన 6.58 ఎకరాల భూమిని మూలపాడుకు చెందిన మహిళకు అస్వాదినపు సేల్ కమ్ జీపీఏ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ మహిళ, అధికారుల సహకారంతో భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ వివాదం కోర్టులో ఉండగా, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన సామ్యేలు సోమవారం మృతి చెందారు. ఈ ఘటనపై ఆయన కుమారుడు బుచ్చిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.