నందిగామ: కాచేటి వాగు ఆక్రమణపై ఎమ్మార్వోకు ఫిర్యాదు

కంచికచర్ల మండలం పరిటాల గ్రామం పరిధిలోని కాచేటి వాగును కొందరు ఆక్రమించుకున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. వాగులో మట్టితోలి రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. దీనివలన చుట్టుపక్కల ఉన్న పొలాలు దెబ్బతింటున్నాయని పరిటాల రైతులు గురువారం తహశీల్దార్ వేమూరి మానసకు వినతిపత్రం ఇచ్చారు. భారీ వాహనాలతో ఈ వాగును పూడ్చి రహదారి ఏర్పరచడంతో పర్యావరణం దెబ్బతింటుందని అర్జీలో వివరించినట్లు రైతన్నలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్