వీరులపాడు శివారులో సోమవారం రాత్రి వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో పడి ఓ జింక మృతి చెందింది. అడవి జంతువులతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా ఈ ఉచ్చులు ముప్పుగా పరిణమిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.